Amit Shah: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా
Amit Shah: తుమకూరులో రోడ్‌షోలో పాల్గొన్న అమిత్ షా
Amit Shah: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా
Amit Shah: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. జాతీయ పార్టీల తరపున ప్రతిరోజూ నేతలు, అధికార పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా తుమకూరులో జరిగిన రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రోడ్ షోకు బీజేపీ కార్యకర్తలు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. తుమకూరు వీధులన్నీ కమలం జెండాలతో కాషాయ మయమయ్యాయి. ఐబీ సర్కిల్ నుంచి పై హోటల్ వరకు సాగిన రోడ్ షోలో అమిత్ షా అభివాదం చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు.