Paytm Fast Tag: పేటీఎం ఫాస్టాగ్ వినియోగిస్తున్న వారంతా.. వేరే బ్యాంకుల్లో కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలీ

Paytm Fast Tag: మార్చి 15 నుంచి నిలిచిపోనున్న పేటీఎం పేమెంట్స్ బ్యాక్ సేవలు

Update: 2024-03-13 13:55 GMT

Paytm Fast Tag: పేటీఎం ఫాస్టాగ్ వినియోగిస్తున్న వారంతా.. వేరే బ్యాంకుల్లో కొత్త ఫాస్టాగ్ తీసుకోవా

Paytm Fast Tag: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానించిన ఫాస్టాగ్‌లను ఉపయోగిస్తున్నవారికి ఎన్‌హెచ్ఏఐ కీలక సూచన చేసింది. మార్చి 15 లోగా కొత్త ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని కోరింది. ఆర్బీఐ కఠిన ఆంక్షల నేపథ్యంలో మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ఖాతాలతో లింక్ అయి ఉన్న ఫాస్టాగ్‌లపై టాప్-అప్ లేదా రీఛార్జులు సాధ్యపడవని స్పష్టం చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణ సమయంలో జరిమానాలు, రెట్టింపు ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు నూతన ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయడం ఉత్తమమని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పేటీఎం ఫాస్టాగ్‌లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత బ్యాంకులను వినియోగదారులు సంప్రదించవచ్చునని సూచించింది.

Tags:    

Similar News