ఐపీఎస్ అధికారుల బదిలీ.. యోగి సర్కార్ పై ధ్వజమెత్తిన అఖిలేష్

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2020-05-27 08:42 GMT

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో 10 మంది ఐపిఎస్ అధికారుల ఆకస్మిక బదిలీ పోలీసుల మనోధైర్యాన్ని తగ్గిస్తుందని అన్నారు. కరోనా కాలంలో పరిపాలనా స్థిరత్వం సాధారణం కంటే ఎక్కువగా ఉందని, అటువంటి పరిస్థితిలో, ADG , IG స్థాయికి చెందిన 10 మంది ఉన్నతాధికారులను బదిలీ చేయడం పోలీసులను నిరుత్సాహపరిచే పని అని అన్నారు. విధాన వైఫల్యం, కేంద్ర-రాష్ట్రానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. దీనికి ప్రభుత్వం.. అధికారులను నిందిస్తోందని అన్నారు.

కాగా యోగి ప్రభుత్వం రాష్ట్రంలో 10 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేసింది, ఇందులో చాలా మంది ముఖ్యమైన అధికారులు ఉన్నారు. ఇందులో లా అండ్ ఆర్డర్(ADG) పివి రామశాస్త్రికి డిజి విజిలెన్స్ బాధ్యతలు అప్పగించారు. 1990 బ్యాచ్ ఐపిఎస్ ప్రశాంత్ కుమార్ కు లా అండ్ ఆర్డర్(ADG) పదవి లభించింది. ఈయన దాదాపు మూడు సంవత్సరాలు మీరట్ జోన్‌లో పని చేశారు. ఆయనకు క్షేత్రస్థాయి అనుభవం కూడా ఉంది. 

Tags:    

Similar News