Air India Flight Crash: కూలిన ఎయిర్ ఇండియా విమానం..!
Air India Flight Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Air India Flight Crash: కూలిన ఎయిర్ ఇండియా విమానం..!
Air India Flight Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌ఇండియాకి చెందిన ఓ విమానం మేఘానీనగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.
వివరాల్లోకి వెళ్తే, అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరే క్రమంలో టేకాఫ్ అవుతుండగా, ఈ విమానం అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొట్టి కూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలిసింది.
ప్రస్తుతం ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి అధికారులు చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగు చూడలేదు.