Air India Express: విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన మహిళ.!

ఒమన్‌ రాజధాని మస్కట్‌ నుంచి ముంబయికి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-07-24 16:52 GMT

Air India Express: విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన మహిళ.!

ఒమన్‌ రాజధాని మస్కట్‌ నుంచి ముంబయికి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ గర్భిణి మార్గమధ్యంలోనే పురిటినొప్పులతో బాధపడగా, వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు.

విమానంలోనే సురక్షిత ప్రసవం

ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న ఓ నర్సు సహాయంతో, క్యాబిన్‌ సిబ్బంది సహకారంతో ఆ మహిళకు సురక్షితంగా ప్రసవం జరిగింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు

పైలట్లు వెంటనే ముంబయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)‌కు సమాచారం అందించారు. విమానం గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే ముందే సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్యం సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఆ మహిళా ప్రయాణికురాలి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Tags:    

Similar News