అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దు
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమైయ్యాయి.
సీఏఏపై మహారాష్ట్ర ప్రజలల్లో నెలకొన్న భయన్ని తొలిగించేందుకు సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నవారిని విమర్శిస్తూ ఆదిత్య ఠాక్రే ట్వీటర్లో పోస్టు పెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే విమర్శలకు జవాబు చెబుదామన్నారు. . వ్యక్తిత్వం లేని మనుషులు సమాదానం చెప్పాల్సిన పని లేదని , ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు యత్నింస్తున్నారని, ప్రజల మనసు గెలవాలి, సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. మహిళలు చిన్నారుల గురించి అసభ్య పోస్టులు పెట్టే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆదిత్య ఠాక్రే తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శించిన వారికి ట్వీట్ ద్వారా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమైయ్యాయి. ఉద్యోగాల కల్పన, ఆర్థిక వ్యవస్థ పురోగమనంతో ట్రోల్స్ చేసేవారికి సమాదానం చెబుదామన్నారు. అయితే ఇటీవలే పౌరసత్వ సవరణ చట్టాన్నిపై ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఆవరణలో నిరసన తెలిపిన విద్యార్థులపైపోలీసులు లాఠీ చార్జీ చేయడంపై ఆదిత్య ఠాక్రే స్పందిచారు. విద్యార్దులపై లాఠీ చార్జీ చేయడాన్ని జలియన్ వాలాబాగ్ ఊచకోతతో పోల్చారు. ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. హిరణ్మయి తివారీ అనే నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై శిశసేన కార్యకర్తలు దాడికి చేసి అతనికి గుండు కొట్టించారు. అతను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో శివసేన కార్యకర్త తీరు పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమతున్నాయి.
Our statement on trolls and reactions. pic.twitter.com/AvTUnAZo5H
— Aaditya Thackeray (@AUThackeray) December 24, 2019