పాన్ కార్డుతో ఆధార్ సంఖ‌్య జతకు మూడురోజులే గడువు

ఈ నెల 30లోగా పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును జతచేసుకోవడానికి గడువు ముగుస్తుందని అధికారులు చెప్పారు. ఆధార్‌ లేని పాన్‌కార్డులను ఆదాయపన్ను చట్టంలోని 139AA (2) ప్రకారం రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు.

Update: 2019-09-27 05:43 GMT

ఈ నెల 30లోగా పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును జతచేసుకోవడానికి గడువు ముగుస్తుందని అధికారులు చెప్పారు. ఆధార్‌ లేని పాన్‌కార్డులను ఆదాయపన్ను చట్టంలోని139AA (2) సెక్షన్‌ ప్రకారం రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. గడవు ముగిసిన అనంతరం ఆధార్‎ను పాన్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలంటే కొత్త ఐటీఆర్‌ ఫైల్‌ చేసేవారు, అప్పుడు పేర్కొనే ఆధార్‌ సంఖ్యతో కొత్త పాన్‌ నెంబరు జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ జతపరచని వారు 30వ తేదీలోగా ఆదాయపన్ను శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌ ద్వారా పాన్‌తో ఆధార్‌ను జతచేయాలని అధికారులు సూచించారు. లేకుంటే పాన్ కార్డు రద్దవుతుందని వారు తెలిపారు.

Tags:    

Similar News