ఆధార్ కార్డు అప్‌డేట్ కావాలా? ఇప్పుడు కొన్ని కొత్త నిబంధనలు తప్పనిసరి.
ఆధార్ కార్డు లేని పరిస్థితుల్లో దేశంలో దాదాపు ఏదైనా పని కొనసాగించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఆధార్ కార్డు అప్డేట్ ప్రక్రియపై నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఆధార్ పూర్తిగా అప్‌డేట్ అయి ఉండాలని స్పష్టంగా తెలిపింది.

ఇప్పటికే ఆధార్ కార్డు కలిగివున్న వారు ఫోటో, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసుకోవాలనుకుంటే తాజా నిబంధనల ప్రకారం నిర్దిష్ట డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, కొత్తగా ఆధార్ కార్డు పొందదలచుకున్నవారూ ఈ నియమాలు పాటించాలి.
ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను యూఐడీఏఐ విడుదల చేసింది. ఆధార్ కోసం ఏదైనా డాక్యుమెంట్ ఫేక్‌గా ఇవ్వకూడదు. ఒక వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నెంబర్లు సృష్టైతే వాటిలో ముందుగా వచ్చినదే చెల్లుబాటవుతుంది, మిగిలినవన్నీ రద్దు చేయబడతాయి.
ఆధార్ కోసం అవసరమయ్యే కీలక డాక్యుమెంట్లలో గుర్తింపు కార్డు (జరిగిన పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు), చిరునామా ధృవీకరణ కోసం విద్యుత్ లేదా నీటి బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, రెంటల్ అగ్రిమెంట్ లాంటి ఆధారాలు తప్పనిసరిగా సమర్పించాలి.
పుట్టిన తేదీ రుజువుగా స్కూల్ మార్క్ షీట్లు, పాస్‌పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్లు లేదా ప్రభుత్వాలిచ్చే సర్టిఫికెట్ అవసరం. భారతీయ పౌరులతో పాటు ఎన్ఆర్ఐలు, ఐదేళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు, భారత్‌లో దీర్ఘకాలిక వీసాతో ఉన్న విదేశీయులు కూడా ఆధార్ కార్డు కోసం అర్హులు.
ప్రస్తుతం ఆధార్‌ను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సేవ 2026 జూన్ 14 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఆధార్ అప్‌డేట్ చేయాలనుకుంటే ఈ గడువులోపే అవసరమైన డాక్యుమెంట్లతో అప్లై చేయడం ఉత్తమం.