Karnataka: సీఎం బసవరాజు బొమ్మైపై ముద్దుల వర్షం కురిపించిన ఓ మహిళ

Karnataka: బొమ్మై కుడిచేతిని పట్టుకుని ముద్దులు

Update: 2021-11-02 13:51 GMT

బసవరాజ్ బొమ్మై చేతుపై ముద్దులు పెట్టిన ఓ మహిళా (యూట్యూబ్ ఇమేజ్)

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకు వింత అనుభవం ఎదురైంది. అభిమానంతో ఓ మహిళ బొమ్మైపై ముద్దుల వర్షం కురిపించింది. జనసేవక కార్యక్రమంలో భాగంగా సీఎం బొమ్మై బెంగుళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి ముందుకు వెళ్లగా.. సీఎంను చూసిన సంతోషంలో అక్కడున్న ఓ మహిళ బసవరాజ్ బొమ్మై కుడిచేతిని పట్టుకుని పదే పదే ముద్దులు పెట్టుకుంది. ఆమె ప్రవర్తనతో సీఎం ఇబ్బందికి గురయ్యారు. సీఎం చేతిపై మహిళ ఆపకుండా ముద్దులు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Tags:    

Similar News