కిరాణా కోసం వెళ్ళాడు..పెళ్ళిచేసుకుని వచ్చాడు!

కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రపంచమంతా లాక్ డౌన్ అయిపొయింది. నిత్యావసరాలకు తప్ప ప్రజలు ఎక్కడికీ వెళ్ళడానికి అవకాశం లేదు.

Update: 2020-04-30 05:02 GMT
guddu and savitha at police station (image courtesy ANI)

కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రపంచమంతా లాక్ డౌన్ అయిపొయింది. నిత్యావసరాలకు తప్ప ప్రజలు ఎక్కడికీ వెళ్ళడానికి అవకాశం లేదు. అందరిదీ ఒక రకం కష్టం అయితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన 26 ఎల్లా గుడ్డూ కు మాత్రం మరో రకమైన కష్టం వచ్చింది. ఇంట్లో తెలీకుండా పెళ్ళిచేసుకుని కాపరం పెట్టేసిన ఈ యువకుడు..లాక్ డౌన్ కారణంతో అకస్మాత్తుగా భార్యను తీసుకుని స్వంత ఇంటికి వచ్చాడు. అతని తల్లి ఇద్దరినీ ఇంట్లోకి రావద్దంటూ పోలీసుల వద్దకు వెళ్ళింది.

ANI వార్తా సంస్థ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తరప్రదేశ్ లోని షహీబాబాద్ కు చెందిన గుడ్డూ అనే యువకుడ్ని అతని తల్లి కిరాణా సామాన్లు తీసుకురమ్మని బయటకు పంపించింది. కొంతసేపటి తర్వాత ఆ సుపుత్రుడు ఇంటికి చేరాడు. అయితే, ఒంటరిగా కాదు జంటగా. తాను పెళ్ళాడిన సవిత అన్న అమ్మాయిని తీసుకుని వచ్చాడు. ఆ సంఘటనను అతని తల్లి జీర్ణించుకోలేక పోయింది. ఆమె వారిద్దరినీ తన ఇంటిలోనికి రానీయలేదు. అంతే కాకుండా తన కొడుకు పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేనీ పెళ్లిని ఎటువంటి పరిస్థితిలోనూ ఒప్పుకునేది లేదంటూ భీష్మించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అసలే లాక్ డౌన్ తో పని ఎక్కువై ఒత్తిడిలో ఉన్న వారికి ఈ సమస్య పెద్దదిగా తయారైంది. దాంతో వారు గుడ్డూ ను వివరాలు అడిగారు.

'' రెండు నెలల క్రితమే నేను హరిద్వార్ లోని ఆర్యసమాజ్ మందిర్ లో సవిత ను వివాహం చేసుకున్నాను. లాక్ డౌన్ కారణంగా మేరేజి సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయాను'' అని చెప్పాడు. అయితే, హరిద్వార్ నుంచి వచ్చిన తరువాత ఒక అద్దె ఇంట్లో సావిత ఉంటోంది. కానీ లాక్ డౌన్ కారణంగా ఇంటి యజమాని ఆ ఇల్లు ఖాళీ చేయమన్నాడు. అందుకే నా ఇంటికి సవితను తీసుకువచ్చాను'' అని వివరించాడు.

తాత్కాలికంగా సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు సవిత ఇంటి యజమానిని పిలిపించి లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ ఆమెను అదే ఇంటిలో ఉండేలా చూడాలని చెప్పారు.


Tags:    

Similar News