ఢిల్లీ గఫార్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Delhi: మార్కెట్ మొత్తం విస్తరించిన మంటలు

Update: 2022-06-12 06:58 GMT

ఢిల్లీ గఫార్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోరల్ బాగ్‌లోని గఫార్ మార్కెట్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి విస్తరించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 39 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. మార్కెట్‌లో ఎవరూ చిక్కుకోలేదని, ఇప్పటి వరు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు.

Tags:    

Similar News