Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందు పాతర.. ఇద్దరు బెటాలియన్ పోలీసులకు తీవ్ర గాయాలు
Chhattisgarh: పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతర
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందు పాతర.. ఇద్దరు బెటాలియన్ పోలీసులకు తీవ్ర గాయాలు
Chhattisgarh: చత్తీస్‌గఢ్ లోని దంతెవాడ జిల్లాలోని బార్సుర్ పల్లి సమీపంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బెటాలియన్ పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ మీడియా ప్రతినిధి సైతం గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు వేశారని.. సమాచారం రాగా.. వాటిని తొలగించడానికి 195 బెటాలియన్ పోలీసులు వెళ్లారు. బార్సుర్‌పల్లి సమీపంలోకి రాగానే.. అదే సమయంలో పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చేశారు. ఈఘటనలో గాయపడిన పోలీసులను హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు.