Delta Plus Variant: టెన్షన్ పుట్టిస్తోన్న డెల్టా ప్లస్

Delta Plus Variant: మన దేశంలో మొత్తం 11 రాష్ట్రాకు డెల్టా ప్లస్ వేరియంట్ విస్తరించినట్లు ఎన్‌సీడీసీ తెలిపింది.

Update: 2021-06-26 02:30 GMT

Delta Plus Variant:(The Hans India)

Delta Plus Variant: తన రూపాన్ని మార్చుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా ఇపుడే వదిలేలా కనిపించడం లేదు. ఇపుడిపుడే అన్ లాక్2.0 తో ఊపిరి పీల్చుకుంటుండగా భారత్‌లో మొదటిసారిగా వెలుగుచూసిన డెల్టా వేరియెంట్ (B.1.617) ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు 85 దేశాల్లో కేసులు నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్ వేరియంట్లలో డెల్టానే అత్యంత ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుండడంతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి.

మన దేశంలో మొత్తం 11 రాష్ట్రాకు డెల్టా ప్లస్ వేరియంట్ విస్తరించినట్లు ఎన్‌సీడీసీ తెలిపింది. మొత్తం 18 జిల్లాల్లో 48 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఈ వేరియెంట్ ఉందని వెల్లడించారు. మనదేశంలో ఒక్క మహారాష్ట్రలోనే 20 డెల్టా ప్లస్ కేసులు ఉన్నాయి. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌లో 7, కేరళో 3, గుజరాత్‌లో 2, పంజాబ్‌లో 2, ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, కర్నాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయినట్లు కేంద్రవైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 45వేల శాంపిల్స్‌ను సీక్వెన్సింగ్ చేయగా ప్రస్తుతం 48 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. గత నెలలో మధ్యప్రదేశ్‌లో ఒకరు డెల్టా ప్లస్ లక్షణాలతో మరణించగా.. తాజాగా మహారాష్ట్రలో మరొకరు చనిపోయారు.,

మనదేశంలో ఇంకా సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదని వెల్లడించారు. ఇంకా 75 జిల్లాల్లో 10శాతం కన్నా ఎక్కువ వైరస్‌ ప్రభావం ఉంది. మరో 92 జిల్లాల్లో 5 నుంచి 10 శాతంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు మన దేశంలోని బీటా వేరియంట్‌తో పాటు ఆల్ఫా, బీటా, గామా రకం వైరస్‌లపైనా సమర్థవంతంగా పని చేస్తున్నాయని బలరాం భార్గవ చెప్పారు. గర్భిణులు సైతం ఎలాంటి భయాందోళన చెందకుండా టీకాలు వేయించుకోచ్చని సూచించారు. డెల్టా ప్లస్‌ కరోనా రకాన్ని ఆందోళనకర రకముగా ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మనదేశంలో ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలకు అడ్వైజరీ జారీచేసింది. నిర్లక్ష్యంగా ఉంటే ముప్పు తప్పదని హెచ్చరించింది.డెల్టా వేరియంట్ చాలా తొందరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల కణాలకు అతుక్కుని దాడి చేస్తుంది. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి కూడా లొంగదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Tags:    

Similar News