Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోయిస్టుల హతం.. మృతుల్లో అగ్రనేత!

Chhattisgarh: ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు సమాచారం.

Update: 2025-05-21 07:01 GMT

Maoist Sudhaker: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్..అగ్రనేత ఎన్ కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో అడవులు దద్దరిల్లాయి. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు బుధవారం కూడా మావోయిస్టుల కోసం జల్లెడ పట్టాయి. దీంతో నారాయణపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టుల ఎదురుపడ్డారు.

దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు మృతిచెందారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు సమాచారం. మరికొంతమందికి గాయాలయ్యాయి.

మాధ్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Tags:    

Similar News