శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు...రాజకీయ వర్గాల్లో చర్చ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన- బీజేపీ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన- బీజేపీ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఫలితాల అనంతరం పదవుల పంపకాలపై పోటీ పడ్డాయి. బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుని శివసేనకు 13 మంత్రిపదవులు కేటాయిస్తామని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనికి శివసేన మాత్రం ఒప్పుకోలేదు. 50:50 ఫార్ములాకే శివసేన పట్టుబట్టింది. ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు దాటిన ప్రభుత్వ ఏర్ఫటు అంశంపై ఓ కొలిక్కి రాలేదు.
ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన బీజేపీ అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీకి 170 ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉందని తెలిపారు. సంజయ్ రౌత్ పెల్చిన బాంబు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు . వారు తన మాటల యుద్దానికి పదును పెట్టారు. నవంబర్ 7వతేదీలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే రాష్ట్రపతి పాలన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రపతి పాలనకైనా సిద్ధపడతాము కానీ శివసేనతో రాజీపడమని తేల్చిచెబుతున్నారు. శరాద్ పవర్ లో శివసేన ఎంపీ సంజయ్ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీసింది. మరోవైపు పవర్ లో కాంగ్రెస్ అధిష్టానం కూడా చర్చలు జరుపుతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.
Shiv Sena leader Sanjay Raut: We have more than 170 MLAs supporting us, the figure can even reach 175. #MaharashtraAssemblyPolls pic.twitter.com/QJkNuiV9kk
— ANI (@ANI) November 3, 2019