ఎల్‌వోసీ వద్ద కాల్పులు : 8 మంది ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్‌లోని కీరన్‌ సెక్టార్‌ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్‌నైల్లో ఇండియన్‌ ఆర్మీ ఉగ్రవాదులను హతమార్చింది.

Update: 2020-04-13 06:19 GMT

జమ్మూ కశ్మీర్‌లోని కీరన్‌ సెక్టార్‌ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్‌నైల్లో ఇండియన్‌ ఆర్మీ ఉగ్రవాదులను హతమార్చింది. భారత సైన్యం జరిపిన దాడిలో ఎనిమిది మంది ఉగ్రవాదులు, 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మరణించారని భద్రతా సంస్థలోని ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. ఇది పాకిస్థాన్ కు ఒక హెచ్చరికగా అందులో ఒకరు భావిస్తున్నారు.

కిషన్‌గంగా నది ఒడ్డున పాక్‌ ఉగ్రవాదులు కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దూద్‌నైల్‌పై దాడులు జరిపి ప్రతీకార చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే భారత సైన్యం రంగంలోకి దిగింది ప్రత్యేక దళాలు కీరన్‌ సెక్టార్‌కు చేరుకుని ముందుగా 8 మంది ఉగ్రవాదులను హతమార్చారు.మరణించిన ఐదుగురు ఉగ్రవాదులలో, ముగ్గురు జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు కాగా, మిగతా ఇద్దరు జైష్-ఇ-మొహమ్మద్ (జెఎమ్) తో శిక్షణ పొందారని.. తెలిసిన వ్యక్తులు తెలిపారు. మిగిలిన ఉగ్రవాదులను గుర్తించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి.

వాస్తవ సరిహద్దు అయిన నియంత్రణ రేఖ వెంట శారదా, దూద్‌నైల్‌, షాకోట్ లలో భారత సైన్యం కాల్పులు జరిపినట్లు పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. కానీ 15 మంది సైనికులు మరణించలేదని బుకాయిస్తోంది. 15 ఏళ్ల బాలికతో సహా నలుగురు పౌరులు మాత్రమే తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొంది.

అంతేకాదు 2020 లో 708 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు భారత సైన్యం కారణమని పాక్ ఆరోపించింది.. ఇదిలావుంటే ఏప్రిల్ 10న కీరన్ సెక్టార్లో జరిగిన దాడిలో ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ ట్రూపర్లతో కూడా మరణించినట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News