Rajasthan: కోలిహాన్ కాపర్ మైన్‌లో ప్రమాదం.. లిఫ్ట్ తెగిపోవడంతో గనిలో చిక్కుకున్న 14 మంది
Rajasthan: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఘటన
Rajasthan: కోలిహాన్ కాపర్ మైన్‌లో ప్రమాదం.. లిఫ్ట్ తెగిపోవడంతో గనిలో చిక్కుకున్న 14 మంది
Rajasthan: రాజస్థాన్‌లోని కోలిహన్ కాపర్ మైన్‌లో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ తెగిపోవడంతో 14 మంది గనిలో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడి చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేశాయి. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా లిఫ్ట్‌లో చిక్కుకున్నవారిని బయటికి తీసిన అనంతరం హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్సులను కూడా సిద్ధం చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు అంచనా వేస్తున్నారు.