Breaking : మహారాష్ట్రలో ఘోరం.. గూడ్స్ రైలు వలస కూలీల మీదనుంచి వెళ్లడంతో 14 మంది మృతి
మహారాష్ట్రలో ఘోరం చోటుచేసుకుంది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఛత్తీస్ ఘడ్ కు చెందిన 15 మంది వలస కూలీలు స్వస్థలాలకు చేరుకోవడానికి రైల్వే ట్రాక్ వెంట నడుస్తున్నారు.
మహారాష్ట్రలో ఘోరం చోటుచేసుకుంది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఛత్తీస్ ఘడ్ కు చెందిన 15 మంది వలస కూలీలు స్వస్థలాలకు చేరుకోవడానికి రైల్వే ట్రాక్ వెంట నడుస్తున్నారు.. ఈ సమయంలో శుక్రవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద గూడ్స్ రైలు వారి మీదనుంచి వెళ్లడంతో 14 మంది అక్కడికక్కడే మరణించారు. ఒక వ్యక్తికి గాయాలయ్యాయని.. శవాలు చెల్లాచెదురుగా పడ్డాయని అధికారులు తెలిపారు. ఉదయం 6:30 గంటలకు ఔరంగాబాద్-జల్నా రైల్వే లైన్‌లో ఈ సంఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తున్న కార్మికులు అలసటతో ట్రాక్ మీద నిద్రపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఒక అధికారి వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.
ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో మాట్లాడానని, పరిస్థితిని పర్యవేక్షించాలని కోరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో తెలిపారు. అవసరమైన సహాయం అందిస్తున్నట్లు మోదీ కూడా భరోసా ఇచ్చారు. రైల్వే మంత్రిత్వ శాఖ.. ఈ విషాద సంఘటనపై విచారణకు ఆదేశించింది.