Kashmir: క్రికెట్ ఆడుతున్న 102 ఏళ్ల కశ్మీరీ తాతయ్య.. వీడియో వైరల్
Kashmir: యంగ్‌స్టర్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా క్రికెట్ పిచ్‌లో షాట్లు
Kashmir: క్రికెట్ ఆడుతున్న 102 ఏళ్ల కశ్మీరీ తాతయ్య.. వీడియో వైరల్
Kashmir: కశ్మీర్‌కు చెందిన ఓ తాతయ్య వందేళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నాడు. రియాసి ఏరియాకి చెందిన 102 ఏళ్ల హజి కరమ్ దిన్ యువకులతో పోటీగా బ్యాట్ చేత పట్టి తన స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్నాడు. యంగ్‌స్టర్స్‌తో పోటీగా క్రికెట్ పిచ్‌లో పరుగులు తీస్తున్నాడు. ఆత్మవిశ్వాసం ఉంటే వయసు అడ్డుకాదని, స్పోర్ట్స్ ఆడితే ఫిట్‌నెస్ అదే ఉంటుందనే సందేశాన్ని ఇస్తున్నాడు. కాళ్లకు ప్యాడ్స్, చేతులకు గ్లౌజులు తొడుక్కుని బ్యాట్‌తో షాట్లు కొడుతున్నాడు. అంతేకాదు ఇటీవల జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లోనూ కరమ్ దిన్ తాతయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.