ఆ రాష్ట్రంలో 24 గంటల తర్వాత ఇతరులకు ప్రవేశం నిషేధం
మేఘాలయ రాష్ట్ర వాసుల కోసం 2016 రక్షణ చట్టం సవరణకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం మేఘాలయాలో ఇతరులు ఎవరైనా ఉండాలంటే 24 గంటలు మాత్రమే ఉండాలి.
మేఘాలయ రాష్ట్ర వాసుల కోసం 2016 రక్షణ చట్టం సవరణకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం మేఘాలయాలో ఇతరులు ఎవరైనా ఉండాలంటే 24 గంటలు మాత్రమే ఉండాలి. 24 గంటలకు మించి ఉంటే వివరాలు ప్రభుత్వా అధికారుల వద్ద నమోదు చేయాలని సూచింది. త్వరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిన వెంటనే ఈ చట్టం అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం ప్రెస్టోన్ టిన్సోంగ్ వెల్లడించారు.
మేఘాలయ రాష్ట్రంలోకి ప్రవేశించే వలసదారులను కట్టడి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం MRSSA2016 రూపొందించింది. భద్రత అంశాన్ని దృష్టిలో తాజా సవరణలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర రాష్ట్ర సర్వీసు ఉద్యోగులకు ఈ చట్టం వర్తించదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా బయటి వ్యక్తులు సులువుగా నిబంధనలు తీసుకొస్తామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులుగా పరిగణిస్తామని తెలిపారు.