ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల... వేడెక్కిన కన్నడ రాజకీయం

కన్నడ నాట రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయి. ఈ మేరకు ఉపఎన్నికల తేదీలను ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్‌ 5న పోలింగ్‌ పోలింగ్ జరగనుంది.

Update: 2019-11-10 12:13 GMT
Election Commission

కన్నడ నాట రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయి. ఈ మేరకు ఉపఎన్నికల తేదీలను ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్‌ 5న పోలింగ్‌ పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 9న వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కర్ణాటక అసెంబ్లీలో బలనిరుపణ సమయంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 15 మంది సభ్యులు బీజేపీకి మద్దతు నిలిచారు. దీంతో అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు.

అనర్హత వేటుపై వారు సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఉపఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ఈసీ స్పష్టం చేసింది. అనర్హత వేటు గురైనా ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా స్పీకర్ వారిపై వేటు వేశారు. దీంతో వారు సుప్రీం గడప తొక్కారు. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేస్తుందా లేక సమర్ధిస్తుందా వేచి చూడాలి. ఈ కేసు విచారణ ఇంకా ముగియలేదు ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ రావడంతో ఉత్కంఠ నెలకొంది.

ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సర్కారుకు సవాల్‌గా మారింది. బలపరీక్ష తర్వాత మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సర్కార్ గద్దె దిగడంతో యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కొసరు మెజార్టీ నడుపుతోన్నారు. ఇప్పుడు 15 స్థానాలకు ఉపఎన్నికలు రావడంతో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని నడపాలని యోచిస్తుంది. కాగా కాంగ్రెస్-జేడీస్ ఉపఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో కన్నడ రాజకీయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొనివుంది. 

Tags:    

Similar News