Prabhas: ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లి తిరుపతిలోనే చేసుకుంటా..

Adipurush: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్న లేటస్ట్ మూవీ ‘ఆదిపురుష్’.

Update: 2023-06-07 09:28 GMT

Prabhas: ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లి తిరుపతిలోనే చేసుకుంటా..

Adipurush: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్న లేటస్ట్ మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది. గతంలో విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనిపై మంచి స్పందన వ్యక్తం అవుతోంది.

ఈ ఈవెంట్‌లో ప్రభాస్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వేడుకనుద్దేశించి ప్రభాస్‌ మాట్లాడుతూ.. ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని, కుదిరితే మూడు సినిమాలు వచ్చేలా చూస్తానని అన్నారు. అలాగే తన పెళ్లిపైనా ప్రభాస్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతుండగా, 'పెళ్లెప్పుడు' అని అభిమానులు అడగ్గా, 'ఇక్కడే తిరుపతిలోనే ఎప్పుడైనా చేసుకుంటా' అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

Tags:    

Similar News