"మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం" అంటున్నా జీవిత రాజశేఖర్
Jeevitha: "సినిమాల్లోకి వచ్చే ముందు మా అమ్మాయిలకి ఒక సలహా ఇచ్చాను" అంటున్నా జీవిత
"మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం" అంటున్నా జీవిత రాజశేఖర్
Jeevitha: సీనియర్ హీరో రాజశేఖర్ మరియు జీవితాలకు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. శివాని మరియు శివత్మికా ఇద్దరు ఇప్పుడు ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఈ మధ్యనే "అహనా పెళ్ళంట" లో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్గా నటించిన శివానీ "విద్యా వాసుల అహం" అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. మరోవైపు శివాత్మిక "పంచతంత్రం" అనే యాంతోలజీలో నటించింది.
హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ తమ కూతురు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు జీవిత. "చిన్నప్పటినుంచి శివాని మరియు శివాత్మిక సినిమాలోనే పెరిగారు. ఆ ప్రభావంతోనే పెద్దయ్యాక సినిమాల్లో నటిస్తామని చెప్పారు. అప్పుడు నేను రాజశేఖర్ చాలా టెన్షన్ పడ్డాం. సినిమాలో రాణించటం అంత సులువు కాదు. చిన్నప్పటి నుంచి వాళ్లకి ఏది కావాలన్నా ఆస్తులు అమ్మయినా సరే చేశాము.
కానీ సినిమాల్లో నటించే పేరు తెచ్చుకోవటం, మంచి క్యారెక్టర్స్ రావటం అనేది విధి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడా కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. మీరు నటించడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, సినిమాల్లో మా వంతు మేము సపోర్ట్ చేస్తాం కానీ సినిమాల్లో రాణించినా, రాణించ లేకపోయినా మీరు బాధపడకూడదు అని సలహా మాత్రమే ఇచ్చాము" అని చెప్పుకొచ్చారు జీవిత రాజశేఖర్.