Vijay Devarakonda : టాప్ 10 లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ ఒక్కడే!

Vijay Devarakonda : పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మొదలై అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు హీరో విజయ్ దేవరకొండ.. ఇక ఆ సినిమా

Update: 2020-08-22 08:55 GMT

Vijay Devarakonda

Vijay Devarakonda : పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మొదలై అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు హీరో విజయ్ దేవరకొండ.. ఇక ఆ సినిమా తర్వాత గీతా గోవిందం భారీ హిట్ కావడంతో విజయ్ స్థాయి మరింతగా పెరిగింది. ఇక డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ప్లాప్స్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ అఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్-2019 జాబితాలో విజయ్ దేవరకొండ మూడో స్థానంలో నిలిచాడు.. అయితే టాప్ 10లో మరో టాలీవుడ్ హీరో ఒక్కరు కూడా లేకపోవడం విశేషం.. ఈ జాబితాలో మొదటి రెండు జాబితాలో బాలీవుడ్ హీరోలు షాహీద్ కపూర్ మొదటి స్థానంలో ఉండగా, రన్ వీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచారు.. విజయ్ మూడో స్థానంలో ఉండడం పట్ల రౌడీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరొనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పూరి రూపొందిస్తున్నారు. ఇప్పటీకే ఈ సినిమాలో చేయబోయే స్టంట్స్ కోసం విజయ్‌ దేవరకొండ థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించనుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా విజయ్ కి పదోది కాగా, పూరికి 37 వ సినిమా ..

Tags:    

Similar News