Vijay Devarakonda: గౌత‌మ్‌కి డేట్లు ఇచ్చిన విజయ్ దేవరకొండ..

* నెక్స్ట్ సినిమాకి డేట్లు ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ

Update: 2022-12-26 15:00 GMT

గౌతం తిన్ననూరికి డేట్లు ఇచ్చిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో "ఖుషీ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ మరియు టీ సిరీస్ కలిసి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ షూటింగ్ లాంచనంగా ప్రారంభం కాబోతోంది.

ప్రస్తుతం "ఖుషి" సినిమాకి సంబంధించి ఇంకా 35 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉంది. కానీ సమంత వస్తే కానీ ఈ షూటింగ్ ముందుకెళ్లదు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న సమంత షూటింగ్లకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ సమంత ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడకపోవడంతో ఇది కుదరలేదు. ప్రస్తుతానికి జనవరి మూడో వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి గౌతమ్ తిన్ననూరితో సినిమా మొదలు పెట్టాలని విజయ్ దేవరకొండ కూడా ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే గౌతం తిన్ననూరికి డేట్లు కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విజయ్ దేవరకొండ స్నేహితులతో కలిసి బాలి వెళ్ళబోతున్నాడు. అక్కడ వారం రోజులు గడిపిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి రాబోతున్నారు. తర్వాత జనవరి మూడో వారం నుంచి ఖుషి షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. మహానటి సినిమాలో కూడా జంటగా కనిపించిన విజయ్ దేవరకొండ మరియు సమంత ఈ సినిమాలో ప్రేక్షకులను అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News