బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నవెంకీ మామ .. మూడు వారాల కలెక్షన్లు ఎంతంటే
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం వెంకీమామ డిసెంబర్ 13 న రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. టాక్ పరంగానే కాదు. కలెక్షన్ల పరంగా కూడా వెంకీమామ దూసుకుపోతుంది. నిజజీవితంతో మామా అల్లుళ్లు రీల్ లైఫ్లోమా అల్లుళ్లుగా నటించారు.
ఈ చిత్రం వెంకటేష్, నాగచైతన్యల చిత్రాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన వెంకీమామ సినీమా మూడో వారంలో కూడామంచి వసూళ్లతో దూసుపోతుంది. నందమూరి బాలకృష్ణ రూలర్, ప్రతి రోజూ పండగే, కార్తీ నటించిన తమిళ అనువాద చిత్రం దొంగ లాంటి సినిమాలు వచ్చి ఈ సినిమా వెంకీ మామ జోరు తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.
ఈ సినిమా తొలిరోజే ఓపెనింగ్స్ మాత్రం ఓ రేంజిలో వచ్చాయి. తొలిరోజు నుంచి బాక్సాఫీసును కొల్లగొట్టిన మామా అల్లుళ్ళు మూడో వారం కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు వారల్లో రూ.72 కోట్లు వసూళ్లు సాధించి సత్తా చాటింది. మరికొన్ని రోజులు పాటు కలెక్షన్లు ఇలానే ఉంటే వంద కోట్ల కబ్ల్ లో చేరుతుంది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెంకీమామ లో వెంకీకి జోడిగా పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. సురేష్ బాబు, టీవీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
మామా అల్లుళ్ళ బంధంలో జాతాక రీత్యా ఎదురైన కష్టాల్ని ఎదుర్కోవడ వాటి నుంచి బయట పడడం ఇంతే. కానీ, దీన్ని తన స్క్రీన్‌ప్లే బలంతో తెర మీద ఆసక్తికరంగా ఆవిష్కరించారు దర్శకుడు. కామెడీతో వినోదాత్మకంగా నడిపించాడు. వెంకటేష్ మేనరిజమ్స్ కామెడీని పండించాయి. కానీ, జాతక ప్రభావం మామకు దూరంగా వెళ్లిపోయి, కార్తీక్ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. మేనల్లుడి కోసం ఏం చేసాడు అన్నదే మిగతా కథా ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.