Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు..!

Mahesh Babu: వారణాసి చిత్రంపై అపార అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ మొత్తం ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడనే వార్త వైరల్ అవుతోంది.

Update: 2025-12-11 11:19 GMT

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు..!

Mahesh Babu: వారణాసి చిత్రంపై అపార అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ మొత్తం ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడనే వార్త వైరల్ అవుతోంది. 

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం వారణాసిపై అపార అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన గ్రాండ్ టైటిల్ లాంచ్‌లో మహేష్ రుద్రుడు, శ్రీరాముడిగా కనిపించనున్నట్లు వెల్లడైంది. ఇప్పుడు సినీ వర్గాల్లో మరో ఆసక్తికర వార్త కలకలం రేపుతోంది. ఈ చిత్రంలో మహేష్ మొత్తం ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడట.

పాన్ వరల్డ్ లెవెల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని అంచనా. ఈ ఐదు గెటప్స్ వార్త నిజమైతే మహేష్ అభిమానులకు పండగేనని చెప్పవచ్చు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News