Upasana Konidela: రామ్ చరణ్‌ అదిరిపోయే పిక్స్‌ షేర్ చేసిన ఉపాసన

ఉపాసన రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూన్నారు.

Update: 2020-03-28 03:55 GMT

ఉపాసన రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూన్నారు.సామాజిక కార్యక్రమాల్లో ఉపాసన పాల్గొంటూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.అది అలా ఉంటే శుక్రవారం రామ్ చరణ్ 35వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఉపాసన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. కాకా ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రామ్ చరణ్‌కు చెందిన రెండు అదిరిపోయే ఫోటోలను షేర్ చేశారు. అయితే రామ్ చరణ్ కరోనా వైరస్ పై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

అందులో భాగంగా ఇంట్లోనే ఉండాలని అభిమానులకి సూచించారు. దీంతో ఈసారి కరొనా కారణంగా ఎలాంటి హంగులు లేకుండా పుట్టిన రోజును జరుపుకున్నారు. రామ్ చరణ్ కోసం ఉపాసన స్వయంగా తయారు చేసిన కేక్‌ను కట్ చేశారు. రామ్ చరణ్ కేక్ కట్ చేస్తున్న ఫోటోలు ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోల్లో చరణ్ వైట్ అండ్ వైట్ వేసి అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో రామ్ చరణ్ ఫోటోలు వైరల్‌గా మారాయి.

మరోవైపు రామ్ చరణ్ కు పుట్టిన రోజున రాజమౌళి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుథిరం. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ లుక్ విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Tags:    

Similar News