Razakar Movie : రజాకార్ సినిమా ప్రదర్శన ఆపాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
Razakar Movie: ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ.. పిటిషన్ దాఖలు చేసిన APCR
Razakar Movie : రజాకార్ సినిమా ప్రదర్శన ఆపాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
Razakar: రజాకార్ సినిమా ప్రదర్శన విడుదల కాకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మూవీ విడుదలను నిలిపేయాలని పిటీషనర్ ధర్మాసనాన్ని కోరారు. సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రజాకార్ సినిమాపై అభ్యంతరం ఉంటే నిపుణుల కమిటీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని పిటీషనర్‌కు సూచించింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను సవాలు చేయనందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. ప్రత్యామ్నయం ఉందంటూ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది.