Trikala Movie: 'త్రికాల' నుంచి మెస్మరైజింగ్ మెలోడీ.. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజికల్ మ్యాజిక్!
Trikala Movie: అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్స్ తర్వాత నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ 'త్రికాల'.
Trikala Movie: అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్స్ తర్వాత నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ 'త్రికాల'. మణి తెల్లగూటి దర్శకత్వంలో శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా 'యాలో ఈ గుబులే ఎలో' అనే పాటను విడుదల చేశారు.
ఈ పాటలో హర్షవర్ధన్ తనదైన సిగ్నేచర్ ఇంటెన్సిటీని, మెలోడీ డెప్త్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. ప్రతి బీట్‌లోనూ ఆయన మ్యూజికల్ బ్రిలియన్స్ కనిపిస్తోంది.
ఈ మెలోడీకి గాయకుడు అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ప్రాణం పోశారు. భావోద్వేగాలను పండించడంలో తనకున్న వెర్సటిలిటీని మరోసారి నిరూపిస్తూ, శ్రోతల హృదయాలను హత్తుకునేలా పాడారు.
రాకేందు మౌళి అందించిన సాహిత్యం క్యాచీగా ఉండగా, సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రాఫీ పాటకు ప్రత్యేకమైన వైబ్‌ను తీసుకొచ్చింది.
'త్రికాల' చిత్రం విడుదలకంటే ముందే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అవ్వడం విశేషం.
శ్రద్ధా దాస్, మహేంద్రన్‌తో పాటు అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రోహిణి వంటి భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అన్ని ఏరియాల్లోనూ భారీ డిమాండ్ ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.