Pawan Kalyan: నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు
Tollywood: నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు.
Pawan Kalyan: నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు
Tollywood: నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు నిర్మాతలు పవన్‌కు వివరించనున్నారు. సినిమా టికెట్ల రేట్ల,అదనపు షోలపై పవన్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్‌కు వివరించనున్నారు.
అలాగే, సినిమా టిక్కెట్ల ధర పెంపు విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరనున్నారు. థియేటర్ల సమస్యలపైనా ఈ సందర్భంగా చర్చించనున్నారు. నిర్మాతలు అశ్వనీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్యలతో పాటు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్ తదితరులు పవన్‌ను కలిసే వారిలో ఉన్నారు.