Rekha: వందల కోట్లకు మహారాణి.. అంబానీ ఇంటిని తలపించే హౌస్.. కానీ ఈ తెలుగు స్టార్ హీరోయిన్ మాత్రం ఒంటరే!
Rekha: చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు..పోతుంటారు. కానీ కొంతమంది మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఎప్పుడూ మరువలేని ఒక గుర్తింపును క్రియేట్ చేసుకుంటారు. అలాంటి హీరోయిన్ లలో రేఖ ఒకరు. అసలు ఇప్పటి తరానికి రేఖ గురించి పెద్దగా తెలియకపోవచ్చు.కానీ 90వ దశకంతో రేఖ అంటే ఓ సెన్సెన్షనల్ .
పోస్టర్ పై రేఖ బొమ్మ కనిపిస్తే చాలు హీరో ఎవరో కూడా ఆలోచించకుండా అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీసేవారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటి అర్థమవుతోంది. హీరోలు స్క్రీన్ పై కనిపిస్తే ఇప్పటికే చొక్కలు చింపుకుని..నానా గోల చేసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అప్పట్లో రేఖ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఈలలు, గోలలతో థియేటర్ మోత మోగిపోవాల్సిందే.
అంతటి స్టార్ డమ్ ఉన్నప్పటికీ రేఖ మాత్రం చాలా సింపుల్ గా ఉండేది. ఒక దశలో బాలీవుడ్ ను ఏలిందని చెప్పవచ్చు. జెమిని రమేశ్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా..తనకంటూ ఓ ప్రత్యేక స్టార్ డమ్, స్టేటస్ ను క్రియేట్ చేసుకుంది రేఖ. అస్సలు అప్పట్లో రెమ్యూనరేషన్ అంటే రేఖదే అని చెప్పవచ్చు. ఒక్కొ సినిమాకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునేదట. స్టార్ హీరోకు కాస్త అటుగా మాత్రమే ఉండదట ఈ బ్యూటీ రెమ్యూనరేషన్.
ఇక రేఖ అన్ స్క్రీన్ మీదనే కాదు..ఆఫ్ స్క్రీన్ లోనూ ఒక సంచలనం. ఈ బ్యూటీ బాలీవుడ్ లో పలు ఎఫైర్లు కూడా నడిపినట్లుగా ఇప్పటికీ వార్తల్లో వస్తుంటాయి. ముఖ్యంగా అమితాబ్ తో రేఖ సీరియస్ గా రిలేషన్ లో ఉండేదని వార్తలు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వీడిపోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత అమితాబ్ జయా బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ రేఖ మాత్రం ఇప్పటికే ఒంటరిగానే ఉన్నారు. అమితాబ్ తో పాటు మరో ఆరుగురు స్టార్ హీరోలతో ఈ బ్యూటీ ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి.
ఇక రేఖ ఆస్తుల విషయానికి వస్తే 332కోట్ల ఆస్తులు ఉన్నాయట. అంతేకాదు ముంబైలోని బసేరా అనే బంగ్లా కూడా ఉంది. రేఖ ప్రస్తుతం అందులోనే ఉంటుంది. ఆ బంగ్లా ఖరీదు 100కోట్లపైనే. 6కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ కారుతోపాటు 2.5కోట్ల విలువ చేసే జేసే మెర్సిడెస్ బెంజ్ కారు, ఆడి ఎ8, బీఎమ్ డబ్ల్యూ ఐ7 వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.