పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మెగా మేనల్లుడు!

Sai Dharam Tej Maariage : టాలీవుడ్ లో మొన్నటివరకు మోస్ట్ బ్యాచిలర్ గా కొనసాగిన హీరోలు రానా, నితిన్, నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడని మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి.

Update: 2020-10-29 09:09 GMT

Sai Dharam Tej Maariage : టాలీవుడ్ లో మొన్నటివరకు మోస్ట్ బ్యాచిలర్ గా కొనసాగిన హీరోలు రానా, నితిన్, నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడని మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. పెద్దలు కుదిర్చిన వివాహామే సాయి చేసుకుంటున్నాడని కొన్నిసార్లు వార్తలు రాగా, మరికొన్ని సార్లు తన చిన్నప్పటి స్నేహితురాలుని పెళ్లి చేసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తల పైన సాయి తేజ్ స్పందించాడు.

తన పెళ్లి విషయంలో మీడియా వాళ్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని అందుకే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని అన్నాడు సాయి తేజ్.. అయితే తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏమీ లేదని అన్నాడు. ఇక తనకి తగిన వధువును వెతకాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారని, అందుకు తానూ ఒకే చెప్పినట్టుగా వెల్లడించాడు. కుటుంబ సభ్యులు కూడా అదే పనిలో ఉన్నారు కాబట్టి వచ్చే ఏడాది సాయి తేజ్ పెళ్లి పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.

అటు గత ఏడాది ప్రతి రోజూ పండగే చిత్రంతో అలరించిన సాయి తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా 'సోలో బ్రతుకే సో బెటర్‌' అనే సినిమాని ఫినిష్ చేశాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించిది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందించింది. ఇక దేవకట్టా సినిమాని చేసే పనిలో ఉన్నాడు సాయి తేజ్..  

Tags:    

Similar News