Venky Atluri to direct Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో వెంకీ అట్లూరి?

Venky Atluri to direct Pawan Kalyan : అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు ఏళ్ళు విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు.

Update: 2020-08-19 10:49 GMT
pawan kalyan, Venky atluri

Venky Atluri to direct Pawan Kalyan : అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు ఏళ్ళు విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు.. ఇప్పటికే మూడు సినిమాలను కమిట్ అయ్యాడు పవన్.. అందులో పవన్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కి 26 వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమా తరవాత క్రిష్, హరీష్ శంకర్ డైరెక్షన్ లలో సినిమాలను చేసేందుకు సిద్దం అయ్యాడు పవన్.. అయితే తాజాగా పవన్ మరో సినిమాకి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది..

మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాడానికి పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.. ప్రస్తుతం ఈ సినిమా రైట్స్ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దగ్గర ఉన్నాయి. ముందుగా ఈ సినిమాని రానా, రవితేజలతో చేద్దమని అనుకున్నారు.. కానీ ఇప్పుడు పవన్ ఈ సినిమాని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో సినిమా పైన ఆసక్తి నెలకొంది.. ఇందులో పవన్ తో పాటుగా తమిళనటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తాడని సమాచారం.. ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట...

ఇక ఈ సినిమాకి తొలిప్రేమ, మిస్టర్ మజ్ను లాంటి లవ్ స్టోరీస్ చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించానున్నాడని తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది.. ఇక ఇదే సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ప్రస్తుతం వెంకీ అట్లూరి నితిన్ హీరోగా రంగ్ దే అనే సినిమాని చేస్తున్నాడు.. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Tags:    

Similar News