కనిపించని పురుగు.. చెవులకి మాస్క్ తొడుక్కొని వినండి.. కరోనాపై రాం గోపాల్ వర్మ స్వామ సాంగ్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలోఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే.

Update: 2020-04-01 07:06 GMT
Ram Gopal Varma (File Photo)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలోఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. సామాజిక అంశాలపై తనదైనశైలిలో స్పందించడమే, ఎప్పటికప్పుడు సినిమాలు చేయడం తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా యావత్ ప్రపంచం అల్లాడిపోతుంటే వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

కరోనా దేశంలోకి ఎంట్రీ ఇవ్వగానే చావు కూడా చైనదేనా అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్మ కరోనా వైరస్ పై ప్రజలకు సూచనలు ఇస్తూ సొంతంగా ఓ పాట రాసి, పాడేశారు. కరోనా వైరస్ పైన రాసి, పాడిన "కనిపించని పురుగు" అనే పాట ప్రోమోని ఇవాళ ట్విట్టర్ వేదిక ద్వారా విడుదల చేశారు.

చేతులు కడుక్కుని మరీ ఈ పాట వినాలని వర్మ ఇచ్చిన సలహా నెటిజన్లకు కొత్తగా అనిపించింది . సాధారణంగా ఏ అంశాన్నైనా తనదైన శైలిలో విభిన్నంగా విశ్లేషించే వర్మ, కరోనాపై తనకున్న కసి అంతా తన పాటలో వినిపించాడు. పూర్తి పాటను ఇవాళ సాయంత్రం 5.30కి రిలీజ్ చేస్తానన్నాడు. మాస్క్ తొడుక్కొని తన పాట వినాలని వర్మ నెటిజన్లను కోరాడు.

కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. వైరస్ దాటి ప్రపంచ వ్యాప్తంగా అన్ని 42 వేల 341 మంది పైగా మరణించారు. దేశంలో 52 మంది ఈ కరోనా బారిన పడి మరణించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ విజృభిస్తుంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ 87 కేసులు నమోదయ్యాయి. 



Tags:    

Similar News