సెన్సార్ పూర్తి చేసుకున్న అనుష్క 'నిశ్శబ్దం'
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క... అందులో భాగంగానే అరుంధతి, భాగమతి, పంచాక్షరి లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క... ఆమె చేసిన అరుంధతి, భాగమతి, పంచాక్షరి లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా పేరు కూడా వచ్చింది. ఇప్పుడు 'నిశబ్దం' అంటూ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. అంజలి, శాలిని పండే, మాధవన్ ఈ చిత్రంలో కీలక పత్రాలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్సకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ముందుగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్, హిందీ విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.విడుదలకు అన్ని సిద్దంగా ఉన్న తరుణంలో.. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంబన కారణంగా కేంద్ర ప్రభుత్వం మార్చ్ నెలలో దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో థియేటర్లు మూతబడటంతో 'నిశ్శబ్దం'తో పాటు విడుదలకు సిద్దంగా ఉన్నఅన్ని సినిమాల విడుదలలు ఆగిపోయాయి. అలాగే నిర్మాణలో ఉన్న అనేక చిన్న, పెద్ద చిత్రాలు ఆగిపోయాయి. 'నిశ్శబ్దం' సినిమా నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తునట్లు వదంతులు వచ్చాయి. వాటిని నిర్మాత కోన వెంకట్ ఖండించారు.
'నిశ్శబ్దం'సినిమా ఎట్టకేలకు మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''మా రెండు సినిమాలు 'నిశ్శబ్దం'తెలుగు, 'సైలెన్స్'లకు సెన్సార్ బోర్డు యు/ఎ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులు స్పందన చూసి నాకెంతో ఆనందం కలగచేసింది. ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలని వారు ఇచ్చిన సలహాకు నా కృతజ్ఞతలు''అని దర్శకుడు హేమంత్ మధుకర్ మధుకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.