Subbaraju: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటులు సుబ్బరాజు
Subbaraju Wedding: కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాతో సుబ్బరాజు సినిమాల్లోకి అడుగుపెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా , విలన్ గా, కమెడియన్ గా ఆయన పలు సినిమాల్లో నటించారు
Subbaraju: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటులు సుబ్బరాజు
Tollywood actor Subbaraju gets married
Subbaraju Wedding: టాలీవుడ్ నటులు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఇన్ స్టా లో తన భార్యతో దిగిన ఫోటోను ఆయన షేర్ చేశారు. పెళ్లి బట్టల్లో బీచ్ ఒడ్డున సుబ్బరాజు తన భార్యతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుబ్బరాజు భార్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాతో సుబ్బరాజు సినిమాల్లోకి అడుగుపెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా , విలన్ గా, కమెడియన్ గా ఆయన పలు సినిమాల్లో నటించారు. బాహుబలి సినిమాలో ఆయన కుమార వర్మ పాత్రను పోషించారు. ఈ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను మెప్పించింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సుబ్బరాజు స్వంత ఊరు. ఆయన అసలు పేరు పెన్మత్స సుబ్బరాజు. ఖడ్గం సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి సినిమా కూడా ఆయనకు మంచి పేరు తెచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ సినిమాల్లో ఆయన నటించారు.