OTT: ప్రతీ క్షణం ఉత్కంఠ భరితం.. ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త చిత్రం
OTT: ప్రతీ క్షణం ఉత్కంఠ భరితం.. ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త చిత్రం
OTT: ప్రతీ క్షణం ఉత్కంఠ భరితం.. ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త చిత్రం
OTT: రొటీన్ సినిమాలు కాకుండా వైవిధ్యభరితమైన సినిమాల కోసం చూసే వారికి ఓటీటీలో ఓ సినిమా ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఆరంభం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కేరాఫ్ కంచరపాలం ఫేస్ హోహన్ భగత్ నటించిన ఈ సినిమా ఓటీటీ లవర్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్, ప్రతీ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతతో సాగుతుంది.
టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభూతిని అందిస్తోంది. దీంతో ఈ మూవీ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇంతకీ సినిమా కథ ఏంటి.? అంతలా ఆకట్టుకుంటోన్న అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కథ విషయానికొస్తే.. కాలాఘటి అనే జైల్ నుంచి ఖైదీ నెంబర్ 299 అనే వ్యక్తి తప్పించుకుంటాడు. అయితే అతను ఎలా తప్పించుకున్నాడు.? ఎటు పారిపోయాడు.? అన్న దానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. దీంతో ఈ మిస్టరీ ఎస్కేప్‌కు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తారు. ఈ కేసును చేధించడానికి డిటెక్టివ్ కూడా రంగంలోకి దిగుతారు. ఈ విచారణంలో పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. అసలు ఆ ఖైదీ ఏమైపోయాడు.? ఎలా తప్పించుకున్నాడు.? విచారణలో భాగంగా తేలిన ఆ ఆసక్తికరమైన అంశాలు ఏంటి.? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ట్రామ్ ట్రావెలింగ్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఆరంభం మూవీ కూడా ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను అందిస్తోందని చెప్పడంలో సందేహం లేదు.