Satyagrahi: అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా సినిమాని ఆపేయమని చెప్పారా?

Satyagrahi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డైరెక్షన్ కొత్త ఏమీ కాదు.

Update: 2022-12-27 14:30 GMT

Satyagrahi: అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా సినిమాని ఆపేయమని చెప్పారా?

Satyagrahi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డైరెక్షన్ కొత్త ఏమీ కాదు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ "ఖుషి" సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను తానే కొరియోగ్రాఫ్ చేసుకున్నారు. ఆ తర్వాత తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి "డాడీ" సినిమాలో కూడా కొన్ని స్టైలిష్ సీక్వెన్స్ లకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన "జానీ" సినిమాకి తానే దర్శకుడిగా వ్యవహరించారు. రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ "సత్యాగ్రహి" అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించాల్సింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. నిర్మాతతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల పవన్ కళ్యాణ్ ఈ సినిమా నుంచి తప్పకున్నారు అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే మరి కొందరు మాత్రం ఈ సినిమా అని ఒక పొలిటికల్ సినిమాగా తీయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారని కానీ అది వర్కౌట్ అవ్వదేమోనని కొందరు అనుమానాలు రేకెత్తించారు అని తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిర్మాత ఏ ఎం రత్నం పవన్ కళ్యాణ్ స్వయంగా తనకు కాల్ చేసి సినిమాని ఆపేయమని చెప్పారని చెప్పుకొచ్చారు.

"జానీ" సినిమా రిజల్ట్ చూశాక పవన్ కళ్యాణ్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆయన డైరెక్షన్స్ స్కిల్స్ తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాయి అందుకే మళ్ళీ డైరెక్టర్ గా మారి నిర్మాతను రిస్క్ లో పడేయాలని ఆయన అనుకోలేదు అందుకే ఈ సినిమాని ఆపేశారు అని ఏ ఎం రత్నం చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమాకి ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News