Mahesh Babu: రాజమౌళి సినిమాకి సీక్వెల్స్ ఉంటాయి అంటున్న రైటర్
* మహేష్ బాబు సినిమా గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
Mahesh Babu: రాజమౌళి సినిమాకి సీక్వెల్స్ ఉంటాయి అంటున్న రైటర్
Mahesh Babu: బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు మరియు రాజమౌళి లది ఒక క్రేజీ కాంబినేషన్ అవ్వతోందని అభిమానులు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా గురించిన ప్రతి ఒక్క అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కూడా కథని అందిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించిన ఒక మరొక ఆసక్తికరమైన అప్డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కనుందని చెప్పిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాని ఒక ఫ్రాంచైజ్ గా మార్చబోతున్నామని కొన్ని సీక్వెల్స్ కూడా సినిమాకి రాబోతున్నాయని ప్రకటించారు. అయితే ప్రతి సీక్వల్ కి కథ మారుస్తుంది కానీ పాత్రలు మాత్రం అవే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ చేయబోతున్నారని అన్నారు విజయేంద్రప్రసాద్. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ విజయేంద్రప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు ఒక ఇంటెన్స్ యాక్టర్ అని రాజమౌళి ఎప్పటినుంచో మహేష్ బాబుతో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా తీయాలనుకుంటున్నారు అని అది ఇప్పటికి కుదిరింది అని అన్నారు.