ప్లాప్ టాక్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు.. ‘ది రాజా సాబ్’కు కలిసొచ్చిన కొత్త సీన్లు!

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో థియేటర్లలో భారీ సందడి చేస్తోంది.

Update: 2026-01-14 05:50 GMT

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో థియేటర్లలో భారీ సందడి చేస్తోంది. బుక్ మై షోలో ఇప్పటివరకు దాదాపుగా 1.8 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రన్ కొనసాగిస్తోంది. మారుతి దర్శకత్వంలో హారర్ ఫాంటసీ శైలిలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదట ప్లాప్ టాక్ వచ్చినా, కొత్త సీన్లు యాడ్ చెయ్యటంతో ఇప్పుడు అద్భుతమైన క్రేజ్ కనిపిస్తోంది.

బుక్ మై షో వంటి ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటివరకు దాదాపు 1.8 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. థమన్ సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్నిచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు తీసుకొస్తోంది.

Tags:    

Similar News