Bhartha Mahasayulaki Wignyapthi: ఎల్లువొచ్చి గోదారమ్మ కొత్త అవతారం.. సత్య కామెడీ డాన్స్ సూపర్ హిట్
Bhartha Mahasayulaki Wignyapthi: క్లాసిక్ హిట్ పాట ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ మరోసారి కొత్త రూపంలో ప్రేక్షకులను అలరిస్తోంది. రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో ఈ పాటను వినూత్నంగా చూపించారు.
Bhartha Mahasayulaki Wignyapthi: క్లాసిక్ హిట్ పాట ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ మరోసారి కొత్త రూపంలో ప్రేక్షకులను అలరిస్తోంది. రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో ఈ పాటను వినూత్నంగా చూపించారు. ముఖ్యంగా సత్య చేసిన కామెడీ డాన్స్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తోంది. థియేటర్లలో ఈ సాంగ్ పడగానే నవ్వుల హోరు వినిపిస్తోంది.
శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ సినిమాలో వచ్చిన ఈ పాట తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆ తర్వాత ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో రీమిక్స్‌గా వచ్చి మళ్లీ హిట్ అయింది. ఇప్పుడు దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ఈ పాటకు మరో కొత్త అవతారం ఇచ్చారు. సత్య తన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో డాన్సర్‌తో కలిసి చేసిన పెర్ఫార్మెన్స్ థియేటర్లలో ప్రేక్షకులను కేకలు, ఈలలతో సంబరపడేలా చేస్తోంది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. రవితేజ అభిమానులు ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ అంటూ సంబరాలు చేస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్ ఆకర్షణగా నిలవగా, సునీల్, వెన్నెల కిషోర్, సత్యల కామెడీ సినిమాకు మరింత బలం ఇచ్చింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.