Janhvi Kapoor: మా గ్లామర్ తో వాళ్లు బిజినెస్ చేసుకుంటున్నారు

Janhvi Kapoor: బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అందాల తార జాన్వీ కపూర్, ఇప్పుడు నెట్టింట వినిపించే విమర్శలకు ధీటైన సమాధానమిస్తూ వార్తల్లో నిలిచారు.

Update: 2026-03-04 04:32 GMT

Janhvi Kapoor: మా గ్లామర్ తో వాళ్లు బిజినెస్ చేసుకుంటున్నారు

Janhvi Kapoor: బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అందాల తార జాన్వీ కపూర్, ఇప్పుడు నెట్టింట వినిపించే విమర్శలకు ధీటైన సమాధానమిస్తూ వార్తల్లో నిలిచారు. గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీల గురించి వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శల గురించి జాన్వీ స్పందిస్తూ చాలా పరిణతి చెందిన మాటలు చెప్పారు. ఇంటర్నెట్‌లో ఎవరో ఏదో అన్నారని నేనెప్పుడూ బాధపడను. ఇప్పుడు అందరికీ వ్యూస్, లైక్స్ కావాలి. అందుకే సెలబ్రిటీల పేర్లను వాడుకుని వివాదాస్పద కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వారి పేజీలకు క్లిక్స్ తెచ్చుకోవడానికి మనల్ని ఒక బలిపశువులా వాడుకుంటారు. ఒకసారి ఇది వారి బిజినెస్ అని మనకు అర్థమైతే, ఆ మాటలను పట్టించుకోవడం మానేస్తాం అంటూ ట్రోలర్ల అసలు రంగును బయటపెట్టారు.

ముఖ్యంగా తన సోదరుడు అర్జున్ కపూర్ ఎదుర్కొంటున్న బాడీ షేమింగ్, యాక్టింగ్ ట్రోల్స్ పై జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. అర్జున్ పై వస్తున్న నెగెటివిటీని భరించడం కష్టమని, అది వేధింపుల స్థాయికి చేరినప్పుడు బాధ కలుగుతుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు గడవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు, దీని గురించి ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలోచించడం అనవసరం అంటూ ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

జాన్వీ కపూర్ కెరీర్ పరంగా ఇప్పుడు గోల్డెన్ ఫేజ్‌లో ఉన్నారు. టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ‘ఉప్పెన’తో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ముందుగా మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు ఏప్రిల్ 30కి వాయిదా పడింది. మెగా అభిమానులు ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తరాదిలో తన నటనతో మెప్పించిన జాన్వీ, ఇప్పుడు దక్షిణాదిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

Tags:    

Similar News