OTT Release: 9 నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘కిల్లర్ ఆర్టిస్ట్’

Killer Artist: సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సినిమాల సందడి కొనసాగుతుండగా, మరోవైపు ఓటీటీలోనూ కొత్త మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Update: 2026-01-13 10:37 GMT

OTT Release: 9 నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘కిల్లర్ ఆర్టిస్ట్’

Killer Artist : సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సినిమాల సందడి కొనసాగుతుండగా, మరోవైపు ఓటీటీలోనూ కొత్త మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్రలో నటించిన ఈ మూవీ పేరు ‘కిల్లర్ ఆర్టిస్ట్’.

ఓటీటీలోకి కిల్లర్ ఆర్టిస్ట్

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ ఆర్టిస్ట్ ఇవాళ (జనవరి 13) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇది రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నా కూడా ప్రత్యేకంగా రెంట్ చెల్లించి మూవీ చూడాల్సి ఉంటుంది.

9 నెలల తర్వాత డిజిటల్ రిలీజ్

కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ థియేటర్లలో విడుదలైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా 2025 మార్చి 21న థియేటర్లలో రిలీజ్ అయింది. దీనికి రతన్ రిషి దర్శకత్వం వహించగా, బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల ప్రధాన పాత్రలో నటించింది.

ఈ చిత్రంలో సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, సత్యం రాజేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కిల్లర్ ఆర్టిస్ట్ కథ

‘మర్డర్ చేయడం ఒక ఆర్ట్’ అని నమ్మే ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగే కథే కిల్లర్ ఆర్టిస్ట్. విక్కీ (సంతోష్ కల్వచెర్ల) తన చెల్లి స్వాతి (స్నేహ మాధురి)తో కలిసి ఉంటాడు. విక్కీ ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న స్వాతిపై దుండగులు అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరుస్తారు. ఈ ఘటనలో స్వాతి ప్రాణాలు కోల్పోతుంది.

చెల్లి మరణంతో విక్కీ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. అతని లవర్ జాను (క్రిషేక పటేల్) అతణ్ని ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది.

థ్రిల్లింగ్ ట్విస్ట్

ఇదిలా ఉండగా, నగరంలో హీరోయిన్ మాస్క్ ధరించి అమ్మాయిలను హత్య చేస్తున్న ‘పిచ్చి రవి’ అనే సైకో కిల్లర్ గురించి పోలీసులు తెలుసుకుంటారు. అతడిని అరెస్టు చేస్తారు. అదే సమయంలో విక్కీ ఇంట్లోనూ హీరోయిన్ మాస్క్ లభించడంతో, స్వాతిని కూడా ఇదే కిల్లర్ చంపాడేమోనని విక్కీ అనుమానిస్తాడు.

ఆ సైకో కిల్లర్‌ను చంపాలని విక్కీ నిర్ణయించుకుంటాడు. కానీ పోలీసుల నుంచి తప్పించుకున్న ఆ కిల్లర్ జాను బర్త్‌డే పార్టీలోకి వెళ్తాడు. ఇక్కడే కథలో కీలకమైన ట్విస్ట్ బయటపడుతుంది. స్వాతిని చంపింది ఈ సైకో కిల్లర్ కాదని తెలుస్తుంది.

అయితే స్వాతిని చంపిందెవరు? జాను బర్త్‌డే పార్టీలోకి ఆ కిల్లర్ ఎందుకు వెళ్లాడు? ఈ కథలో సోనియా ఆకుల పాత్ర ఏమిటి? అన్న ఉత్కంఠభరిత ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కిల్లర్ ఆర్టిస్ట్ మూవీని ఓటీటీలో చూడాల్సిందే.

Tags:    

Similar News