Dhamaka: అందుకే రవితేజ సినిమాకి రామ్ చరణ్ నో చెప్పారా..?

* రవితేజ సినిమాని ఎప్పుడో రిజెక్ట్ చేసిన రామ్ చరణ్

Update: 2022-12-26 11:46 GMT

Dhamaka: ధమాకా సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Dhamaka: భారీ అంచనాల మధ్య మాస్ మహారాజా హీరోగా నటించిన ధమాకా సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా కొంత ఉరట ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. మొదటి రోజు నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఈ సినిమాలో వింటెజ్ రవితేజ, ఎనర్జిటిక్ రవితేజని ఆవిష్కరించినందుకు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక శ్రీ లీల కూడా తన నటనతో పాటు డాన్స్ తో కూడా అదరగొట్టింది.

అయితే కథ కి సినిమాలో అంత ప్రాధాన్యత లేదు. అదే సేమ్ ఓల్డ్ స్టోరీ, లాజిక్ లేని స్క్రీన్ ప్లే ఉంది అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది. అయితే గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కొన్నేళ్ల క్రితం ఇదే కథను వినిపించారు. కానీ రామ్ చరణ్ అప్పుడు సినిమాలో లాజిక్ లేదని చెప్పి రిజెక్ట్ చేసేసారు. ఆ కథ పట్టుకుని ఎంతోమంది హీరోలను సంప్రదించిన ప్రసన్నకుమార్ ఎట్టకేలకు రవితేజా ను ఈ కథతో మెప్పెంచగలిగారు. ఇలా రామ్ చరణ్ వద్దు అన్న కథ ఇప్పుడు రవితేజ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఇంద్ర స్పూఫ్ సన్నివేశం ఒకటి ఉంటుంది. రామ్ చరణ్ ఈ సినిమా రిజెక్ట్ చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకొని డైరెక్టర్ కావాలనే ఇందులో ఇలాంటి సీన్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో మరియు ఒక రిచ్ ఇంట్లో ఒక్కడే కొడుకుగా వ్యవహరిస్తూ ఉండే కాన్సెప్ట్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాటిక్ లిబర్టీస్ ని ధమాకాలో ఎక్కువగా తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. గతంలో ఇలా లాజిక్ లేకుండా రామ్ చరణ్ తీసిన బ్రూస్లీ, వినయ విధేయ రామ సినిమాలో డిజాస్టర్ లైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని గుర్తుంచుకునే రామ్ చరణ్ ఈ సినిమాకి నో చెప్పారేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News