జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా ప్రభంజనం

National Film Awards: 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2022-07-22 15:12 GMT

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా ప్రభంజనం

National Film Awards: 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫోటో ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రంగా నాట్యం, ఉత్తమ సంగీత చిత్రంగా అల వైకుంఠపురములో నిలిచాయి. నాట్యం చిత్రానికి గానూ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో అవార్డులు వరించాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్‌ ఎంపికయ్యారు.

కలర్‌ఫోటో మూవీకి జాతీయ అవార్డు రావడంపై చిత్ర యూనిట్ స్పందించింది. తొలి ప్రయత్నంలోనే నేషనల్ అవార్డ్ వస్తుందని ఏనాడూ అనుకోలేదని ఇది తమ బాధ్యతను పెంచిందని సినిమా నిర్మాత సాయి రాజేశ్, దర్శకుడు సందీప్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని సినిమాను రిలీజ్ చేశామని అవార్డు ప్రకటించిన జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు.

68 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో నాట్యం సినిమాకు రెండు అవార్డులు వరించాయి. ఉత్తమ కొరియోగ్రఫీతో పాటు ఉత్తమ మేకప్ విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. తనకు అవార్డ్ ప్రకటించడంపై మేకప్ ఆర్టిస్ట్ రాంబాబు స్పందించారు. తనకు అవార్డు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన రాంబాబు తన టీమ్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు. 

Tags:    

Similar News