Actress: చుట్టూ చీరలతో కవర్ చేస్తే డ్రస్ మార్చుకునేది.. తమన్న డెడికేషన్ అలాంటిది మరి.
కార్తీ కెరీర్‌లో ది బెస్ట్ మూవీఎస్‌లో ఆవారా ఒకటి. తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 2010లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా తమన్నా హీరోయిన్‌గా అలరించింది. ఆ సమయంలో కార్తీకి ఇది రెండో సినిమా కాగా, తమన్నాకు ఇది తన కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన చిత్రంగా నిలిచింది.
నిజానికి ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగులో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తమన్నాకు టాలీవుడ్‌లో ఒక్కసారిగా క్రేజ్ లభించింది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు స్పెషల్ హైలైట్ అయింది. ఆయన అందించిన పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఆవారా సినిమాలో మొదట హీరోయిన్‌గా తమన్నను ఆనుకోలేదని మీకు తెలుసా.? ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా ప్రకటించారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు లింగుస్వామి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో మొదట నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారంటా. అయితే చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో తమన్నా చాలా యంగ్ వయసు సుమారుగా 19 లేదా 20 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ, కథకు న్యాయం చేసేలా నటించారని లింగుస్వామి ప్రశంసించారు.
మరోవైపు ఆవారా సినిమా మొత్తం రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగిన సినిమా కావడంతో షూటింగ్ మొత్తం ప్రధానంగా ఔట్‌డోర్‌లో సాగిందని, షూటింగ్ సమయంలో కారు, ట్రావెలింగ్ కాన్వాయ్ ఉండకపోవడంతో తమన్నా డ్రెస్ మార్చుకోవాలంటే, యూనిట్ సభ్యులు కారు చుట్టూ చీరలతో కవర్ చేసి ప్రైవసీ కల్పించేవారని లింగుస్వామి తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమన్న చూపించిన డెడికేషన్ ఆశ్చర్యానికి గురి చేసిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ప్రొఫెషనలిజం, సినిమాపై చూపిన అంకితభావం నిజంగా ప్రశంసనీయం అన్నారు.