Tamannaah: భాగస్వామి సెలెక్ట్ విషయంలో తెలివిగా ఆలోచించండి: తమన్నా

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారు చెప్పడం చాలా కష్టం. ఇటీవల విడాకులు, బ్రేకప్‌లు చాలా కామన్ అయిపోయాయి. తాజాగా తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకుని విడిపోయినట్టు టాక్ వినిపిస్తోంది.

Update: 2025-03-07 11:57 GMT

భాగస్వామి సెలెక్ట్ విషయంలో తెలివిగా ఆలోచించండి: తమన్నా

Tamannaah: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారు చెప్పడం చాలా కష్టం. ఇటీవల విడాకులు, బ్రేకప్‌లు చాలా కామన్ అయిపోయాయి. తాజాగా తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకుని విడిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించలేదు. రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన తమన్నా ప్రేమ గురించి మాట్లాడారు. అందుకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఇంతకీ తమన్నా ఏమన్నారో చూద్దాం.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన తమన్నా.. ప్రేమకు ఎలాంటి షరతులు ఉండకూదన్నారు. ఇది కేవలం ప్రేమ జంటకే కాదు, పేరెంట్స్, ఫ్రెండ్స్, మన పెంపుడు జంతువులు ఇలా అన్నింటికి వర్తిస్తుందన్నారు. నీ పార్ట్‌నర్ పై నువ్వు అంచనాలు పెట్టుకోవడం ప్రారంభించావంటే అప్పుడు ఆ బంధం బిజినెస్‌గా మారుతుందన్నారు. నేనిలా అనుకుంటే నువ్వాలా చేశావ్.. నేను చెప్పిన వాటిలో కొన్నే చేశావ్.. ఇలా లిస్టు తయారు చేసుకోవాల్సి వస్తుందన్నారు.

ప్రేమకు, రిలేషన్‌కు తేడా ఉందని.. ప్రేమ పుట్టాకే రిలేషన్ షిప్ మొదలవుతుందన్నారు. ఆ ప్రేమ షరతులు లేకుండా ఉండాలని.. కొన్ని సార్లు అది ఏకపక్షం కూడా కావచ్చన్నారు. అయితే నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఆశిస్తే అది కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమేనన్నారు.

తాను సింగిల్‌గా ఉన్నప్పుడు కంటే రిలేషన్‌లో ఉన్నప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నానన్నారు. ఒక తోడు దొరికితే అంతకు మించిన సంతోషం ఏముంటుంది. కానీ ఎవరిని ఎంచుకున్నామన్నదే ముఖ్యమన్నారు. ఎందుకంటే వారు నీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునే విషయంలో తెలివిగా ఆలోచించి ముందడుగు వేయండి అని చెప్పుకొచారు తమన్నా. 

Tags:    

Similar News