Retro movie: విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోన్న సూర్య ‘రెట్రో’.. అంతర్జాతీయ సమీక్షలో టాప్ రేటింగ్
Retro movie: సూర్య నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం ‘రెట్రో’కు బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC) మొదటి అంతర్జాతీయ సమీక్షను ఇచ్చింది.
Retro movie: విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోన్న సూర్య ‘రెట్రో’.. అంతర్జాతీయ సమీక్షలో టాప్ రేటింగ్
Retro movie: సూర్య నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం ‘రెట్రో’కు బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC) మొదటి అంతర్జాతీయ సమీక్షను ఇచ్చింది. తమిళ భాషలో రూపొందిన ఈ సినిమా యూకే సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. BBFC ఈ సినిమాకు "15 రేటింగ్"ను ప్రకటించింది. ఇందులో వయోలెన్స్‌తో కూడిన సన్నివేశాలు ఉన్నాయని రివ్యూలో పేర్కొన్నారు. ఈ రేటింగ్‌తో రెట్రోపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
సినిమా కథేంటంటే.?
BBFC వివరాల ప్రకారం.. “ఒక మాజీ గ్యాంగ్‌స్టర్ తన హింసాత్మక జీవితాన్ని వదిలేసి ప్రశాంతంగా గడుదామన అనుకుంటాడు. కానీ కుటుంబాన్ని రక్షించేందుకు మళ్లీ ఆ మార్గంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ కథ చుట్టే సినిమా తిరుగుతుంది. ఓవైపు యాక్షన్, మరోవైపు ఎమోషన్ కలగలిపిన రెండు పాత్రలను సూర్య అద్భుతంగా పోషించారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సరికొత్త సూర్య కనిపించనున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సూర్యకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. జయరాం, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాసర్, కరుణాకరన్, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంగీతం సంథోష్ నారాయణన్ అందించారు.
మే 1న ‘రెట్రో’ థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇదే రోజు నాని నటించిన హిట్3 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిట్3 కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుండడంతో రెండింటి మధ్య పోటీ కచ్చితంగా ఉంటుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.