Sukumar: సుకుమార్ ప్లాన్ సూపర్.. రంగస్థలం కాంబో రిపీట్.. సమంతతో పాటు మరో హీరోయిన్
సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సుకుమార్ చెర్రీతో మళ్లీ రంగస్థలం కాంబినేషన్‌తో పాటు మరో హీరోయిన్‌ను కూడా అనుకుంటున్నట్టు సమాచారం.
సుకుమార్ ప్లాన్ సూపర్.. రంగస్థలం కాంబో రిపీట్.. సమంతతో పాటు మరో హీరోయిన్
Sukumar: ఇటీవల వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో చెర్రీ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఈసారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబు ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సుకుమార్‌తో చేయనున్న సినిమాకు సంబంధించి కరసత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సుకుమార్ చెర్రీతో మళ్లీ రంగస్థలం కాంబినేషన్‌తో పాటు మరో హీరోయిన్‌ను కూడా అనుకుంటున్నట్టు సమాచారం. రంగస్థలం కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అయితే రంగస్థలం విడుదల సమయానికి రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ వరకు వెళ్లలేదు. అలాగే సుకుమార్ కూడా పుష్ప సినిమా తీయలేదు. ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇక పుష్ప సినిమాలతో సుకుమార్ స్టేటస్ కూడా పెరిగింది. సమంత విషయానికొస్తే విడాకులు, మయో సైటీస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌లు చేశారు. వీటి ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సుకుమార్ రంగస్థలం కాంబోలో తీయబోయే సినిమాలో రష్మిక మందన్నా కూడా నటిస్తుందని టాక్.
పుష్ప, పుష్ప2 తర్వాత రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాదు ఇటీవల కాలంలో ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అవుతూ వస్తున్నాయి. ఈ ముగ్గురికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మరి సుకుమార్ ఈ ముగ్గురితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రష్మిక, సుకుమార్‌తో కలిసి పుష్ప, పుష్ప2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 చేస్తున్నారు. మరి రామ్ చరణ్, సమంత, రష్మికతో సుకుమార్ ప్లాన్ చేస్తున్న సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.